MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీ సొంతం అనే చెప్పాలి. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ- 2013 ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి మిస్టర్ కూల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు కోట్లాది మంది అభిమానుల హృదయాలను సొంతం చేసుకున్నారు. ఆటతీరుతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అశేష ప్రజల ఆదరాభిమానాలను అందకున్నారు మిస్టర్ కూల్.
అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని క్రికెట్ నాయకుడిగా ఎదిగిన ధోని.. ఫ్రాంఛైజీ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ సీఎస్కే జట్టు ఏకంగా ఐదోసారి చాంఫియన్‌గా నిలపాడు. ధోని మైదానంలోకి వస్తున్నాడంటే చాలు అది ఏ స్టేడియం అయినా సరే హోరెత్తిపోవాల్సిందే. ధోని మేనియాతో జనం ఊగిపోవాల్సిందే. అలాంటిది ధోని పుట్టినరోజు(1981, జూలై 7) అంటే సంబరాలు అంబరాన్నంటాల్సిందే కదా! అవును.. ఈరోజు తలా.. కూల్ కెప్టెన్.. మిస్టర్ కూల్ ధోనీ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా జార్ఖండ్ డైనమైట్ ధోని వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ధోనీ సాక్షిల ప్రేమాయనం ఇలా(MS Dhoni)
ధోనీ సాక్షిలు చిన్నప్పటి నుంచే స్నేహితులంటా మీకు తెలుసా.. ధోనీకి తన చిన్నతనంలోనే సాక్షితో పరిచయం ఉంది. ఇద్దరూ రాంచీలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. అయితే సాక్షి కుటుంబం డెహ్రాడూన్‌కు షిప్ట్ అవడంతో ధోని సాక్షిల పరిచయానికి ఫుల్ స్టాప్ పడింది. తిరిగి వీరిద్దరిని కలపడానికి కాలం 10 సంవత్సరాలు తీసుకుంది. ధోనీ 10 ఏళ్ల తర్వాత క్రికెటర్‌గా టీం ఇండియాలో అడుగు పెట్టాడు. సాక్షి కోల్‌కతాలోని హోటల్ తాజ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. టీమిండియా ఒక మ్యాచ్ ఆడడం కోసం కోల్ కతాలోని హోటల్ తాజ్ లో బసలో చేసింది. ఆ టీమ్ లో ధోని కూడా ఉన్నాడు. అప్పుడు మళ్లీ ధోనీ, సాక్షి కలిశారు. 10 ఏళ్ల తర్వాత కలుసుకున్న ధోని, సాక్షిల చూపులు కలిశాయి. బాలుడుగా విడిపోయిన ధోనీని యువకుడిగా సాక్షి కలిసిన ఆ హోటల్‌లో ఇంటర్న్‌షిప్‌కి చివరి రోజు కావడం విశేషం. 2007లో ధోని తొలిసారి సాక్షిని కలిశాడు. 2010లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జివా సంతానం.
1999-2000 సీజన్‌లో ధోని దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోనీ.. 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4876, 10773, 1617 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇకపోతే మహీభాయ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు నెట్టింట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
My go to man since 2009 to till date and forever. Wishing you a very happy birthday mahi bhai.🎂see u soon in yellow💛 #respect pic.twitter.com/xuHcb0x4lS
— Ravindrasinh jadeja (@imjadeja) July 7, 2023