Site icon Prime9

Jasprit Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

bumrah practicing for T20 world cup

bumrah practicing for T20 world cup

Jasprit Bumrah: ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్‌ కు దూరమైన టీమ్‌ ఇండియా సీనియర్‌ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌తో సహా ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు ఈ బౌలర్ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఈ స్టార్‌ బౌలర్‌ త్వరలో జరుగనున్న మ్యాచ్ ల కోసం కఠోర సాధన చేస్తున్నాడు. కాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను బుమ్రా నెట్టింట షేర్ చేశాడు. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. దానితో టీ20 ప్రపంచకప్‌ నాటికి బుమ్రా ఫామ్‌లోకి వచ్చేందుకు చక్కని అవకాశం దొరికిందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఈ ప్రాక్టీస్ సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్టు  చేసిన వీడియోకు నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత ప్రధాన జట్టును ప్రకటించిన విషయం విధితమే. అలాగే నలుగురిని స్టాండ్‌బై ఆటగాళ్లను కూడా ఎంపిక చేసింది. మరియు ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకూ జట్లను ప్రకటించింది. కాగా సెప్టెంబర్‌ 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తాజాగా వెల్లడించింది.

ఇదీ చదవండి: విరాట్ కు వీరాభిమానం.. ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన కోహ్లీ

 

Exit mobile version