Site icon Prime9

Ravindrasinh jadeja: ధావన్ కు పెళ్లిచెయ్యండి బాగుపడతాడు అంటున్న జడేజా.. నెట్టింట వీడియో వైరల్

jadeja dhawan

jadeja dhawanjadeja dhawan

Ravindrasinh Jadeja: గత కొద్దిరోజులుగా జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికే పరిమితమవ్వగా అతనిని పలకరించడానికి ధావన్ ఆసుపత్రికి వెళ్లారు. కాగా తను నొప్పితో బెడ్ పై ఉండగా ధావన్ డాన్స్ చేస్తూ సందడి చేస్తాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

టీం ఇండియా ఆల్ రౌండర్ జడేజా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అతని పక్కన ధావన్ డాన్స్ చేస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన వీడియోను ధావన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. కాగా పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది. ఆసియా కప్ సందర్భంగా జడేజా గాయపడి, మోకాలికి శస్త్రచికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు. తన సర్జరీకి సంబధించిన ఫొటోలను అభిమానులతో తరచూ పంచుకుంటూనే ఉంటాడు. కాగా జడేజా కోలుకోవడానికి కనీసం 5 నుంచి 7 వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

దీనితో స్వదేశంలో జరిగే ఆసీస్, దక్షిణాఫ్రికాలతో సిరీస్ లతో పాటు టీ20 ప్రపంచకప్ కు జడేజా దూరమయ్యాడు. ఈ తరుణంలో జడేజాను చూడడానికి ఆసుపత్రికి వెళ్లిన ధావన్ అక్కడ రీల్స్ చేశాడు.ఇతనికి తర్వగా పెళ్లిచేయండి బాగుపడతాడు అనే అర్ధం వచ్చేలా ఉన్న హిందీ డైలాగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా ధావన్ స్టెప్పులు వేశాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఇదీ చదవండి: దీప్తిశర్మ మన్కడ్ వివాదానికి తెర.. క్రికెట్ అనలిస్ట్ ప్రతిభ అమోఘం

Exit mobile version