IPL: ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సంచలనాలను తిరగరాసిన ఐపీఎల్ అత్యంత ప్రేక్షకాదరణను పొందింది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది. దీంతో బడా కంపెనీలన్నీ టెలికాస్ట్ రైట్స్ కోసం పోటీపడ్డాయి. ఇటీవలే 2023-2027 వరకు బ్రాడ్‌కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ నిర్వహించింది. తొలిసారిగా బీసీసీఐ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఫలితంగా టీవీ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సుమారు రూ.22వేల 500 కోట్లు చేరినట్లు సమాచారం. అదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విలువ రూ.19 వేల కోట్లకు చేరిందట.
డిస్నీ హాట్ స్టార్ లో ఐపీఎల్ లైవ్..
అయితే ఈ ఏడాది ఐపీఎల్ (IPL) డిజిటల్ ప్రసార హక్కులను వయోకామ్ 18 సంస్థ రూ.20, 500 కోట్లకు దక్కించుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మొత్తం తిరిగి రాబట్టడం కష్టమే అని విశ్లేషకుల అంచనా. అందుకే ఇతర భాషల్లో అందుబాటులోకి తేవడం ద్వారా సబ్‌స్క్రైబర్లను పెంచకోవడంతోపాటు, దాని ద్వారా అదనపు ఆదాయం పొందాలని ఆ సంస్థ భావిస్తోంది. అందుచేత ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ 11 భాషల్లో జరగనుంది. ఇంతకుముందు ఐపీఎల్ ఆరు భాషల్లోనే స్ట్రీమ్ కాగా, ఇకపై 11 భాషల్లో ప్రసారం చేసేందుకు వయోకామ్ 18 సంస్థ నిర్ణయించింది.
దీంతో ఈ ఏడాది వయోకామ్ 18 సంస్థకు చెందిన ‘వూట్’ యాప్‌లో ఐపీఎల్ స్ట్రీమింగ్ కానుంది.
గతంలో డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అయ్యేది. ఈ యాప్‌తో పోలిస్తే వూట్ యాప్‌నకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య తక్కువ. అందుకే సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ఉద్దేశంతో వూట్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది అని సమాచారం. ఇంతకుముందు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ఐపీఎల్ స్ట్రీమ్ అయ్యేది. ఇకపై ఈ భాషలతో పాటు, భోజ్‌పురి వంటి భాషల్లో కూడా ప్రసారం చేయాలని వయోకామ్ 18 సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఐపీఎల్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై 500 మిలియన్ల మంది వీక్షిస్తారని అంచనా. ఈ ఏడాదికి సంబంధించి బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల్ని స్టార్ట్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
Ram Charan-Upasana: సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
Bangalore: 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసిన విమానం.. ఎక్కడో తెలుసా?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/