IPL: ఐపీఎల్ 2023కు సంబంధించిన మినీ వేలంపాటకు సందడి ఆరంభం కానుంది. డిసెంబర్‌లో అన్ని ఫ్రాంఛైజీలు ఆక్షన్‌ను నిర్వహించవచ్చు. ఈ నెల 15వ తేదీ నాటికే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడే 10 ఫ్రాంఛైజీలు తమ జట్టు ప్లేయర్ల వివరాలను అందించాల్సి ఉంటుంది. దానితో ప్రస్తుతం అన్ని జట్లు కూడా కసరత్తులు ప్రారంభించాయి. ప్రాంఛైజీని అట్టిపెట్టుకునే ప్లేయర్లు, రిలీజ్ చేయదలిచిన వారి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేస్తోన్నాయి.
కాగా ఐపీఎల్ టోర్నీలో సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే జట్టులో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచనల మేరకు తుది జట్టులో ఈ సవరణలను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ చేపట్టినట్లు సమాచారం. ఎప్పటి నుంచో భారత ఆల్ రౌండర్ జడేజా సీఎస్కే నుంచి తొలగించినట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీంలోనే కొనసాగించేందుకు ధోనీ మొగ్గు చూపారు. అతన్ని రిలీజ్ చేయడానికి గానీ లైక్ టు లైక్ రీప్లేస్ చేయడానికి గానీ ధోనీ అంగీకరించలేదట. ఇకపోతే రవీంద్ర జడేజా తరహాలోనే రాణించే సత్తా ఉన్న టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని మొదట ప్రాంఛైజీ భావించినా దానికి ధోనీ ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఈ తరుణంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగుతూ వస్తోన్న పేస్ బౌలర్ క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నెలను రిలీజ్ చేయాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు సమాచారం.
వారిద్దరూ గత కొద్దిరోజులుగా ఫామ్‌లో ఉండట్లేదని వారి స్థానంలో వేరే వారిని తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు సమాచారం. ఇద్దరు లేదా ముగ్గురు భారత ప్లేయర్లను కూడా సీఎస్‌కే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు అంచనా.
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన న్యూజిలాండ్