Site icon Prime9

IND vs ING Women’s Cricket: 23 ఏళ్ల తర్వాత… ఇంగ్లండ్ గడ్డపై టీం ఇండియా సరికొత్త రికార్డ్

IND vs ING women cricket

IND vs ING women cricket

IND vs ING Women’s Cricket: ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా మహిళలు సత్తాచాటారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్‌ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 18 ఫోర్లు, 4 సిక్స్‌లతో 111 బంతుల్లో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కాగా హర్మన్ వన్డే కెరీర్‌లో ఇది ఐదో శతకం. ఓపెనర్‌ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన, యస్తిక భాటియా జోడీ రెండో వికెట్‌కు 54 పరుగులను యాడ్ చేసి జట్టుకు కీలకంగా నిలిచారు. తర్వాత మైదానంలోకి అడుగిడిన హర్మన్ దూకుడు ధాటికి ఇంగ్లండ్ జట్టు ఓటమిపాలయ్యింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. డేనియల్‌ వ్యాట్‌ 65 పరుగులతో టాప్‌ స్కోర్ చెయ్యగా..
అలిస్‌ కాప్సీ 39, చార్లెట్‌ డీన్‌ 37రన్స్ ఇచ్చారు. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్‌ 4 వికెట్లు, దయాలన్‌ హేమలత 2, దీప్తి శర్మ, షఫాలీ వర్మ తలా ఒక వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను తన కైవసం చేసుకుంది. ఇక నామమాత్రంగా మారిన చివరి వన్డే సెప్టెంబర్‌ 24న జరగనుంది.

ఇదీ చదవండి: Gymkhana Ground: క్రికెట్ అభిమానులతో జిమ్‌ఖానా మైదానం ఫుల్… టిక్కెట్ల విషయంలో గందరగోళం

Exit mobile version