Womens Asia Cup: మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ మొదటి నుంచి జోరు కొనసాగించిన భారత జట్టు గురువారం థాయ్‌లాండ్ జట్టుపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది.
బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనను కనపరిచి థాయ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. 74 పరుగుల భారీ తేడాతో థాయ్ ను హర్మన్ సేన ఓడించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇకపోతే బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ(42) అద్భుత ప్రదర్శనతో రాణించగా, బౌలింగ్‌లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టింది. మొదటగా టాస్ గెలిచిన థాయ్‌లాండ్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 149 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన థాయ్ జట్టును భారత బౌలర్ దీప్తి శర్మ ఆరంభంలోనే బోల్తా కొట్టించింది. మూడో ఓవర్లోని ఐదోబంతిని దీప్తి వెయ్యగా దానిని ఓపెనర్ కొంచారోయింకై షాట్‌కు ప్రయత్నించింది. కాగా షఫాలీ వర్మ ఆ షాట్ను అద్భుతమైన క్యాచ్ కొంచారోయింకైని ఔట్ చేసింది.
తదుపరి స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లను కోల్పోయిన థాయ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి థాయ్ వికెట్ల పతనం ఆగలేదు. అయితే నిర్ధిష్ట 20 ఓవర్లలో థాయ్‌లాండ్ 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ జట్టు అలవోకగా ఫైనల్‌కు చేరుకుంది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయతో అద్భుత ప్రదర్శన కనపర్చగా, రాజేశ్వరీ గైక్వాడ్ 2, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, షఫాలీ వర్మ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో షఫాలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్‌లో ప్రమాదకర బౌలర్లు వీరే.. ఐసీసీ లిస్ట్ రిలీజ్