IND vs ZIM: రాహుల్ క్లాస్, సూర్య మాస్ కొట్టుడు.. జింబాబ్వే టార్గెట్ @185

మెల్ బోర్న్ వేదికగా నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ హోరాహోరీ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది.

IND vs ZIM: టీ20 వరల్డ్ కప్‌ 2022లో సూపర్-12 మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. మెల్ బోర్న్ వేదికగా నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ హోరాహోరీ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ 51 చెయ్యగా, సూర్యకుమార్ 59 చేశాడు. ఇక పాండ్యా 30 పరుగులు చేశారు. స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ 26, రోహిత్ 15లు మాత్రం తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. దినేష్ కార్తిక్ స్థానంలో బరిలోకి దిగిన పంత్ 3 పరుగులు మాత్రమే చేశాడు. దీనితో భారత్ జింబాబ్వే ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.

ఇదీ చదవండి: సెమీస్ కు దూసుకెళ్లిన పాకిస్తాన్.. బంగ్లాపై గెలుపు