Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బౌలర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. కొల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. 215 పరుగలకు ఆలౌట్ అయింది.
బ్యాటింగ్ ప్రారంభంలో శ్రీలంక బ్యాట్ మెన్లు మంచి ఆరంభమే ఇచ్చినా.. దానిని లంక ఉపయోగించుకోలేకపోయింది. ఓపెనర్ ఫెర్నాండో త్వరగానే ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిస్ (34) అద్భుతంగా రాణించారు. వీరిద్దరు క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు.
తేలిపోయిన లంక బ్యాటర్లు
వీరి ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దీంతో ఈడెన్ గార్డెన్ లో పరుగుల వరద పారింది. వీరు రెండో వికెట్ కి అజేయంగా 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి ఆట చూస్తుంటే భారీ స్కోర్ చేసేలా
శ్రీలంక కనిపించింది. కాని మెండిస్ వికెట్ పడ్డాక స్కోర్ నెమ్మదించంది.
మెండిస్ వికెట్ పడ్డాక.. మిగతా ఏ బ్యాట్స్ మెన్ కూడా రాణించకపోవడంతో తక్కువ పరుగులతోనే లంక సర్దుకోవాల్సి వచ్చింది. లంక బ్యాట్స్ మెన్ లో దునిత్ ఒక్కడే రాణించిన.. మిగతా ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. గత మ్యాచ్ సెంచరీ హీరో.. లంక కెప్టెన్ రెండు పరుగులు చేసి మాత్రమే ఔటయ్యాడు.
చుక్కలు చూపించిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు లంకకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇక పేసర్ ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక భారత్ ముందు ఉన్న లక్ష్యం చిన్నదే కావున.. మ్యాచ్ సునాయసంగా గెలుస్తుందని అభిమానులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1
Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు
Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/