Site icon Prime9

Ind vs SA: సౌత్ఆఫ్రికా పై టీమిండియా బోణి కొట్టేసింది!

ind vs sa prime9news

ind vs sa prime9news

Thiruvananthapuram: నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో  టీమిండియా, సౌత్ఆఫ్రికా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బోణి కొట్టింది. 107 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగినా టీమిండియా 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులను చేసింది.

ఈ మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జరగగా టీమిండియా-సౌత్ఆఫ్రికా టీ20 తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ఆఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్ చూసుకుంటే కేశవ మహరాజ్ 35 బాల్స్ కు 41 పరుగులు, మార్కరం 24 బాల్స్ కు 25 పరుగులు, పార్నెల్ 37 బాల్స్ కు 24 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో కెప్టెన్ బవుమా, రెండవ ఓవర్‌లో డికాక్ కూడా అవుట్ అవ్వడంతో కష్టాలు వచ్చి పడ్డాయి. రెండవ ఓవర్ కు 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు మాత్రమే చేశారు. అర్షదీప్ మ్యాజిక్ తో ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టి, గేమ్ ను టీమిండియా వైపు తిప్పేశాడు. 120 బాల్స్ కు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కేఎల్ రాహుల్ 56 బాల్స్ కు 51 పరుగులు, సూర్యాకుమార్ యాదవ్ 33 బాల్స్ కు 50 పరుగులు, కోహ్లీ 9 బాల్స్ కు 3 పరుగులు చేశారు. మొత్తానికి టీమిండియా ఐతే మంచి ఫామ్ ను ఐతే కనబరస్తుంది.

Exit mobile version