Site icon Prime9

IND vs PAK: టీం ఇండియా టార్గెట్ @160

ind vs pak first innings fineshed pak sets a good target to bharath

ind vs pak first innings finished pak sets a good target to bharath

IND vs PAK:  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు దాయాదీ దేశమైన పాకిస్థాన్ తో భారత జట్టు సమరం ప్రారంభమయ్యింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు భారత్ ముచ్చమటలు పట్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది పాక్. ఈ మ్యాచ్‌లో భారత్‌కు బౌలర్లు శుభారంభం అందించారని చెప్పవచ్చు. పాక్ ఓపెనర్లు స్ట్రాంగ్ ప్లేయర్లైన బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4)లను ఇద్దరినీ స్వల్ప వ్యవధిలోనే ధీటైన బౌలింగ్ తో పెవిలియన్ చేర్చారు.

అనంతరం బరిలోకి  పాక్ ఆటగాళ్లు షాన్ మసూద్ (52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (51) మంచి స్కోరుతో రాణించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2), మహమ్మద్ నవాజ్ (9), ఆసిఫ్ అలీ (2) ఎవరూ బరిలో ఎక్కువ సేపు నిలువలేకపోయారు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ (8 బంతుల్లో 16), హారిస్ రవూఫ్ (4 బంతుల్లో 6 నాటౌట్) బౌండరీలు బాదారు. ఇకపోతే టీంఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ చెరో వికెట్ తీశారు. ఇకపోతే 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఈ మ్యాచ్ నెగ్గుతుందో లేదో వేచి చూడాలి.

ఇదీ చదవండి: స్లో ఓవర్ రేటుకు చెక్.. ఆసిస్ ఐడియా అదిరింది..!

Exit mobile version