Site icon Prime9

IND vs ENG: దీప్తిశర్మ మన్కడ్ వివాదానికి తెర.. క్రికెట్ అనలిస్ట్ ప్రతిభ అమోఘం

deepthi sharma mankad

deepthi sharma mankad

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. షార్లెట్ డీన్‌.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. కాగా ఐసీసీ దీనిని కొత్త నిబంధనల ప్రకారం రనౌట్‌ విభాగంలో చేర్చిన సంగతి విదితమే.

ఇదిలా ఉంటే భారత జట్టు మోసం చేసి మ్యాచ్ గెలిచిందంటూ కొందరు ఇంగ్లండ్ అభిమానులు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నారు. కాగా దీనిపై పీటర్ అనే ఒక క్రికెట్ అనలిస్ట్ చేసిన అనాలసిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మ్యాచ్‌లో షార్లెట్ డీన్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్ బంతిని వేయకముందే అప్పటికి 72 సార్లు క్రీజును వదిలినట్లు మ్యాచ్ హైలెట్స్ రిపీటెడ్ గా చూసిన అతను తేల్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, స్క్రీన్ షాట్లను కూడా తన అనాలసిస్‌లో చూపించాడు. మిగిలిన ఆటగాళ్లెవరూ ఇలా చేయలేదని, డీన్ మాత్రమే ఇలా మాటిమాటికీ చేస్తూ భారత ఆటగాళ్ల కంటపడిందని అతను చెప్పుకొచ్చాడు. డీన్ అలా క్రీజును వదిలిరావడాన్ని ఫీల్డింగ్ చేస్తుండగా దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ పలుమార్లు గమనించారని కూడా ఫొటోలు చూపించాడు. అలాగే తనను అవుట్ చేసే ముందు కూడా వారిరువూ మాట్లాడుకోవడాన్ని, డీన్ ఔట్ అయిన అనంతరం వాళ్ల హావభావాలను కూడా అనలిస్ట్ క్యాప్చర్ చేశాడు.

ఇవన్నీ చూసిన నెటిజన్లు ఆ అనలిస్టును నెట్టింట తెగ మెచ్చుకుంటున్నారు. భారత్ మోసం చేసిందని కామెంట్లు చేస్తున్న ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అనాలసిస్ చేయడం కోసం పీటర్ చేసిన కృషితో ఈ రనౌట్ వివాదానికి తెరపడింది.

ఇదీ చదవండి: పాకిస్తాన్ ను పడగొట్టి.. టీం ఇండియా ప్రపంచ రికార్డ్

Exit mobile version