Site icon Prime9

Deepak Chahar: ప్రపంచకప్ కు మరో టీంఇండియా ఆడగాడు దూరం..!

deepak chahar got inured

deepak chahar got inured

Deepak Chahar: టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీం ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి ఈ టోర్నీకి దూరం అయ్యారు. కాగా ఇప్పుడు ప్రపంచకప్‌ స్టాండ్‌ బై బౌలర్లలో ఒకరైన దీపక్‌ చాహర్‌ కూడా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ సందర్భంగా దీపక్ మైదానంలోకి దిగగా అతని కాలుకి గాయమైంది. ఈ కారణంగానే అతను దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాలుపంచుకోలేదు. కాగా చివరి రెండు వన్డేలకు కూడా చాహర్ దూరం కానున్నాడు.

గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న దీపక్‌ ఇటీవలె జట్టులోకి పునరాగమనం అయ్యాడు. ప్రపంచకప్‌ టోర్నీకి కూడా స్టాండ్‌బైగా సెలక్ట్ చేసినప్పటికి అతన్ని బీసీసీఐ జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు పంపలేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడించాలన్నా గాయం కారణంగా అతను ఈ సిరీస్కు దూరం అయ్యాడు. దానితో మరి టీ20 ప్రపంచకప్ లో కూడా ఆడతాడో లేదో అన్న సందేహం క్రికెట్ అభిమానుల్లో ఉంది.

ప్రపంచకప్‌ టోర్నీకి టీం ఇండియా ప్రాక్టీస్‌ కోసం ఇద్దరు నెట్‌ బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో చెన్నై తరఫున ప్రతిభ కనపరిచిన ముకేశ్‌ చౌదరి, దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున సత్తా చాటిన చేతన్‌ సకారియా నెట్‌ బౌలర్లుగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు పంపించింది. పెర్త్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా వీరిరువురు జట్టుకు సేవలందించనున్నారు. ఆ తర్వాత కూడా జట్టుతోనే కొనసాగుతారు.

ఇదీ చదవండి: బుమ్రా భావోధ్వేగం.. ఆస్ట్రేలియా వెళ్తా అంటూ ట్వీట్

Exit mobile version