Site icon Prime9

T20 World Cup 2024: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వేదిక‌ను మార్చే ఆలోచ‌న‌లో ఐసీసీ.. ఎందుకంటే..?

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు యూఎస్ఏ, వెస్టిండీస్ లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ కప్ వేదికను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూఎస్ఏ గ్రౌండ్స్ కు సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడం అనేది ప్ర‌ధాన కార‌ణం. ఈ నేప‌థ్యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఇంగ్లాండ్‌ కు మార్చాల‌ని ఐసీసీ ఆలోచిస్తుంద‌ని స‌మాచారం.

ఇకపోతే వెస్టిండీస్ కు ఇప్ప‌టికే పలు మెగా టోర్నీల‌కు ఆతిథ్యం ఇచ్చిన‌ అనుభ‌వం ఉంది. కానీ యూఎస్ఏకు మాత్రం ఇదే తొలిసారి. యూఎస్ఏలోని గ్రౌండ్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఐసీసీ ప్ర‌మాణాల‌కు తగినట్టుగా లేవని తెలుస్తోంది. దానితో మరో 12 నెలల్లో ప్ర‌పంచ‌క‌ప్‌కు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టేడియాల‌ను సిద్ధం చేయ‌డం యూఎస్ఏకు సాధ్యం కాదని అందుకే ఈ టోర్నీని ఇంగ్లాండ్ కు మార్చాల‌ని ఐసీసీ భావిస్తోంద‌ట‌.

ఇంగ్లండుకే ఎందుకంటే(T20 World Cup 2024)

ఇంగ్లండుకే మార్చడానికి ఓ కార‌ణం ఉందట. 2030లో ఇంగ్లాండ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాబట్టి ఇప్పుడు 2024లో జరుగనున్న టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తే 2030న ఇంగ్లండులో జరిగే టోర్నీని కాస్త యూఎస్ఏ, వెస్టిండీస్‌ల‌కు మార్చవచ్చని ఐసీసీ భావిస్తోందట. అప్ప‌టి క‌ల్లా యూఎస్ఏ వారి మైదానాల‌ను సిద్దం చేసుకునేందుకు స‌మయం స‌రిపోతుందని అనుకుంటుంది. ఇక ఈ మేర‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.

ఇక ఇదిలా ఉంటే యూఎస్ఏలో కేవ‌లం రెండు స్టేడియాల్లో మాత్ర‌మే అంత‌ర్జాతీయ స్థాయి వ‌స‌తులు ఉన్నాయి. అందులో ఒక‌టి ఫ్లోరిడాలోని సెంట్ర‌ల్ బ్రోవార్డ్ రీజ‌న‌ల్ పార్క్ అయితే రెండోది టెక్సాస్‌లోని మూసా స్టేడియం. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను నిర్వ‌హించేందుకు ఈ రెండు స్టేడియాలతో పాటు మరికొన్ని స్టేడియాలు అవ‌స‌రం. అందుక‌నే యూఎస్ఏకు మ‌రికొంత స‌మ‌యం ఇస్తే ఆలోగా మిగిలిన స్టేడియాలను కూడా సిద్ధం చేసుకుంటుదని ఐసీసీ భావిస్తోంది. మరి ఈ విషయాలపై పూర్తి సమాచారం మరికొన్ని రోజుల్లో తెలనుంది.

Exit mobile version