Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేయడంతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగుల్లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ పై 82 పరుగులు చేసిన కోహ్లీ ఐదు స్థానాలు ఎగబాకి 635 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో మహ్మద్ రిజ్వాన్ 849 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గతవారం రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్ తో పాటు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ధాటిగా ఆడిన కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే, 831 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. సూర్య. 828 పాయింట్లతో థర్డ్ ప్లేస్ కు చేరాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆ తర్వాత మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), పతుమ్ నిస్సంక (శ్రీలంక) లు కోహ్లీ కంటే ముందున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 702 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్‌ను అధిగమించాడు. భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 189 రేటింగ్ పాయింట్లతోనం. 3 ఆల్ రౌండర్ ర్యాంక్‌కు చేరుకున్నాడు.