Site icon Prime9

Gymkhana Ground: క్రికెట్ అభిమానులతో జిమ్‌ఖానా మైదానం ఫుల్… టిక్కెట్ల విషయంలో గందరగోళం

huge crowd gathers at hyderabad gymkhana ground for ind vs aus match tickets

huge crowd gathers at Hyderabad gymkhana ground for ind vs aus match tickets

Gymkhana Ground: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్ల తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌కి వేదికగా నిలవడం వల్ల టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్లను గురువారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు జరుపుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పేర్కొనడంతో.. సికింద్రాబాద్‌లోని జిమ్‌ఖానా మైదానానికి బుధవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు.

ఇదిలావుండగా.. మొదట్లో ఈ మ్యాచ్ టికెట్లను పేటీఎం వేదికగా అమ్మినట్టు హెచ్‌సీఏ పేర్కొంది. అయితే.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ అవ్వడం లేదంటూ చాలామంది క్రికెట్ అభిమానులు ఫిర్యాదు చేశారు. 39 వేల టికెట్లు ఏమయ్యాయంటూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ వేపథ్యంలోనే జిమ్‌ఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో.. ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో జనాలు మైదానానికి తరలివచ్చారు. అయితే.. గేట్లు మూసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ‘హెచ్‌సీఏ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు తీశారు. అప్పుడు దిగివచ్చిన హెచ్‌సీఏ అధికారులు, గురువారం టికెట్లు అమ్ముతామని హామీ ఇచ్చారు.

టిక్కెట్ల విషయంలో గందరగోళం జరగడంపై తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్  కలుగజేసుకుని హెచ్సీఏను హెచ్చరించారు. టీ20 మ్యాచ్ టికెట్లపై అవకతవకలపై విచారణ జరుపుతామని, బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: Ind vs Aus T20: ఆసిస్ మెరుపుదాడికి భారత్ ఓటమి

Exit mobile version