New Delhi: బీసీసీఐ తన రాజ్యాంగంలో ప్రతిపాదించిన మార్పును సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబర్ 14) ఆమోదించింది. దీనితో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షా ఇతర ఆఫీస్ బేరర్‌ల పదవీకాలాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. గంగూలీ, షాల పదవీకాలం గత నెలతో ముగియనుంది. తాజా తీర్పుతో వీరిద్దరి పదవీకాలం మరో మూడేళ్లు వుంటుంది.
రాబోయే రోజుల్లో బీసీసీఐలో ఒక ఆఫీస్ బేరర్ రాష్ట్ర సంఘంలో ఒక పర్యాయం పదవిలో ఉన్నప్పటికీ వరుసగా రెండు పర్యాయాలు పదవిలో కొనసాగేందుకు అనుమతిస్తామని బుధవారం నాడు సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.