Rishab Pant: అవన్నీ రూమర్స్.. అదే నిజమైతే రిషబ్ పంత్ బతికేవాడు కాదు

రెండు రోజుల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయిన విషయం తెలిసిందే. కాగా పంత్ ఓవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి నెట్టింట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Rishab Pant: రెండు రోజుల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయిన విషయం తెలిసిందే. కాగా పంత్ ఓవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి నెట్టింట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే తాగి నడపడం వల్లే రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. తాగిక మైకంలోనే పంత్ డివైడర్‌ని ఢీ కొట్టాడని, లేకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదని కొందరు అంటున్నారు. వీటిపై స్పందించిన పోలీసులు ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ ఆ ప్రచారాలను ఖండించారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ డ్రింక్ చెయ్యలేదని, అతడు తాగి కారు నడపలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. ఒకవేళ పంత్ తాగి కారు నడిపి ఉంటే.. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసేవాడు కాదని హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ వెల్లడించారు.

ఇక ఇదిలా ఉంటే యాక్సిడెంట్‌ జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు అతనికి ప్రాథ‌మిక చికిత్స అందించిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ తాగలేదు కాబట్టే.. కారులో నుంచి బయటకు రాగలిగాడు. నిజానికి.. తాగినవాళ్లు ఆ సమయంలో కారు నుంచి బయటకు రాలేరని మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయేవారని కొందరు అంటున్నారు. పైగా.. పంత్‌ను రక్షించిన బస్‌ డ్రైవర్‌తో కూడా పంత్‌ మాములుగానే మాట్లాడాడని చెప్పారు. పంత్ తన కారుని 80 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితికి మించి నడపలేదని.. బహుశా నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఎస్పీ అజయ్ సింగ్ వెల్లడించారు. తమ టెక్నిక‌ల్ టీమ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని, అక్కడ ఓవ‌ర్ స్పీడ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీ ల‌భించ‌లేదని ఆయన తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం
భావ్యం కాదని పేర్కొంటున్నారు.

team india cricketer rishab pant got accident and severly injured

కాగా.. పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలు అవ్వడం వల్ల పంత్ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: మీకు తెలుసా? రిషబ్ పంత్ మాదిరే ఐదుగురు క్రికెటర్లు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నారు..