Site icon Prime9

Ashes Series 2023: యాషెస్ సెగ.. ఇంగ్లండ్, బ్రిటన్ ప్రధానుల మధ్య క్రికెట్ రచ్చ

Ashes Series 2023: క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్పోర్ట్ కు సెలబ్రెటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ లో యాషెస్ కు ప్రత్యేక స్థానం ఉంది. యాషెస్ సిరీస్ అంటే ఇంగ్లండ్ ఆస్ట్రేలియా దేశాల క్రికెట్ జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడుతాయి. అది మైదానికే పరిమితమైతే ఓ ఎత్తు కానీ ఇదే యాషెస్ వ్యవహారం రెండు దేశాల ప్రధానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌ జరుగుతున్న వేళ ఆ రెండు దేశాల ప్రధానులు కలుసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ టెస్ట్‌ సిరీస్‌ రెండో మ్యాచ్‌లో జాన్‌ బెయిర్‌స్టో ఔట్‌ అయిన తీరు అనేక వివాదస్పద అంశాలకు దారితీసింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేసిన చీటింగ్‌పై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా టీంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధానుల మధ్య క్రికెట్ రచ్చ(Ashes Series 2023)

ఇది ఇంతటితో ఆగకుండా NATO సమ్మిట్‌లో భాగంగా లిథువేనియా రాజధాని విల్నియస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మధ్య స్నేహపూర్వక సమావేశంలోనూ యాషెస్ రచ్చ నడిచింది. ఈ సమావేశంలో ఇరుదేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం ఆంటోనీ ఆల్బనీస్, రిషి సునక్.. ఈ అంతర్జాతీయ వేదికపై యాషెస్ సిరీస్‌కు సంబంధించిన అంశాలను తీసుకువచ్చారు. తొలుత ఆంటోనీ ఆల్బనీస్ తనతో తెచ్చుకున్న కొన్ని పేపర్లు బయటికి తీసి రిషి సునక్‌కి చూపించారు. అందులో మొదటిది యాషెస్ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నామని ఉండగా.. దానికి సమాధానంగా రిషి సునక్, తనతో తెచ్చుకున్న మూడో టెస్టు విన్నింగ్ సెలబ్రేషన్స్‌ని చూపించారు. దీంతో ఇద్దరితో పాటు అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు. అంతటితో ఆగకుండా ఆంటోనీ ఆల్బనీస్ ‘జానీ బెయిర్‌స్టో’ వివాదాస్పద అవుట్‌ని కూడా ప్రదర్శించాడు. దానికి సమాధానంగా రిషి సునక్.. ‘సారీ.. నేను సాండ్ పేపర్ తీసుకురాలేదు..’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఈ ఇద్దరు ప్రధానులు చేసిన ఈ సరదాగా పని, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో రనౌట్ గురించి చాలా పెద్ద చర్చే జరిగిందనుకోండి.

Exit mobile version