Site icon Prime9

Ben Stokes: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు షాక్.. బెన్ స్టోక్స్ బౌలింగ్ అనుమానమే!

ben stokes

ben stokes

Ben Stokes: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు.. బెన్ స్టోక్స్ గాయంతో బాధపడుతున్నాడు. మెున్నటి వరకు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం కష్టమే అనిపించింది. అయితే అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయనున్నట్లు తెలుస్తోంది.

బౌలింగ్ అనుమానమే! (Ben Stokes)

ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు.. బెన్ స్టోక్స్ గాయంతో బాధపడుతున్నాడు. మెున్నటి వరకు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం కష్టమే అనిపించింది. అయితే అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతకొంతకాలంగా మోకాలి సమస్యతో స్టోక్స్ బాధపడుతున్నాడు.
దీంతో ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ను కేవలం బ్యాటర్‌గానే ప్రారంభిస్తాడని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ స్పష్టమైన ప్రకటన చేశాడు.

లీగ్‌ సెకండాఫ్‌ సమయానికి స్టోక్స్‌ పూర్తిగా కోలుకుంటే బౌలర్‌గా సేవలందిస్తాడని హస్సీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ వేలంలో.. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో ఆల్‌రౌండర్‌గా ఇరగదీస్తాడిన సీఎస్ కే భావించింది.

దీంతో సీఎస్ కే ఇప్పుడు అయోమయంలో పడింది. వాస్తవానికి స్టోక్స్‌ 2023 సీజన్‌ మొత్తానికే అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది.

అయితే స్టోక్స్‌కు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఐపీఎల్‌ ప్రారంభ సమయానికంతా రెడీ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఫిట్‌నెస్‌ సరిగ్గా లేనప్పుడు, ఆదరాబాదరాగా అతన్ని ఎందుకు ఆడించాలని సీఎస్‌కే అభిమానులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఆల్‌రౌండర్‌గా పొడిచేస్తాడనే కాదా అతన్ని రూ. 16.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుందని నిలదీస్తున్నారు.

అసలే గత సీజన్‌ను ఆఖరి నుంచి రెండో స్థానంతో ముగించినందుకు ఫీలవుతున్న తమిళ తంబిలకు స్టోక్స్‌ పంచాయితీ పెద్ద తలనొప్పిగా మారింది.

ఇదిలా ఉంటే, మార్చి 31న డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్‌కే తమ ఐపీఎల్‌-2023 జర్నీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

Exit mobile version