Site icon Prime9

BCCI :శ్రీలంక, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లతో షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

Apex Council meeting

Apex Council meeting

BCCI: శ్రీలంక, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరగనున్న సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) గురువారం (డిసెంబర్ 8) ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) క్వాలిఫికేషన్ మరియు భారతదేశంలో జరిగే వన్డే సిరీస్‌లు 2023లో జరుగుతాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 సీజన్‌కు ముందు టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంటుంది. దాని తర్వాత డబ్ల్యుటిసి ఫైనల్ జరుగుతుంది.

భారత్, శ్రీలంకల మధ్య జనవరి 3 నుంచి జనవరి 15 వరకు వన్డే సిరీస్ జరుగుతుంది. దీనికి సంబంధించి జనవరి 3, 5, 7 తేదీల్లో టి20 మ్యాచులు జరుగుతాయి. జనవరి 10, 12, 15 తేదీలలో వన్డే మ్యాచులు జరుగుతాయి. దీనితరువాత న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఇవి హైదరాబాద్, రాయ్‌పూర్ మరియు ఇండోర్‌లో జరుగుతాయి. న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.

భారత్ , ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో టీం ఇండియా తదుపరి మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 17,19, 22 తేదీలలో రెండు జట్లు ముంబయ్, వైజాగ్, చెన్నైలలో మూడు వన్డే మ్యాచులు జరుగుతాయి.

Exit mobile version