IND vs AUS 3rd ODI: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఆసీస్.. వరుస వికెట్లు కోల్పోయింది.
భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో ఆలౌట్ అయింది.
ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఆసీస్.. వరుస వికెట్లు కోల్పోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మెుదటి వికెట్ కు ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించారు.
ఓపెనర్ల జోడిని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో.. ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితవుతుందని అనుకున్నారు.
కానీ చివర్లో స్టోయిన్సన్, అలెక్స్ కేరీ రాణించడంతో ఆసీస్ మంచి స్కోర్ సాధించింది.
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్ గా వెనుదిరిగాడు. స్మిత్ మినహా ప్రతి ఆటగాడు.. తలో చేయి వేయడంతో ఆసీస్ 269 పరుగులు చేయగలిగింది.
భారత బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఇక మొదటి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో వన్డేలో ఓటమిపాలై డీలాపడింది.
ఈ మూడో వన్డేలో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. చెన్నై లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు
మూడో వన్డేలో ఆస్ట్రేలియా మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగింది.
తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు. స్పిన్నర్ అగర్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది.