Asian Games: హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు. అన్నూ రాణి మహిళల జావెలిన్ బంగారు పతకాన్ని గెలుచుకున్న ఒక రోజు తర్వాత భారత్ కు చెందిన జావెలిన్ త్రోయర్లు పతకాలను సాధించడం విశేషం. ఈ ఈవెంట్లో కిషోర్ నీరజ్ కు గట్టిపోటీ ఇచ్చాడు.
ఇదే తొలిసారి..(Asian Games)
ఆసియా క్రీడల్లో జావెలిన్ ఫైనల్లో భారత్ తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే తొలిసారి. మంగళవారం అన్నూ రాణి విజయం సాధించిన తర్వాత ఆసియాడ్‌లో పురుషుల మరియు మహిళల జావెలిన్‌లో భారత్ ఇప్పుడు స్వర్ణం సాధించింది.జావెలిన్ తో గెలుచుకున్న పతకాలతో నేడు ఆసియన్ గేమ్స్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 80 కు చేరింది. వీటిలో 17 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్ ఉన్నాయి. ఆసియన్ గేమ్స్ లో అత్యధికంగా చైనా 312 పతకాలు సాధించి అగ్రస్దానంలో కొనసాగుతోంది. జపాన్ 145 పతకాలతో, దక్షిణకొరియా 144 పతకాలతో రెండు మూడు స్దానాల్లో కొనసాగుతున్నాయి.