Site icon Prime9

Ambati Rayudu: ఐపీఎల్ కు అంబటి రాయుడు గుడ్ బై.. ‘నో యూ టర్న్ ’ అంటూ ట్వీట్

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని అంబటి వెల్లడించాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని అంబటి ట్వీట్ చేశాడు.

 

5 ఐపీఎల్ టైటిల్స్ తో(Ambati Rayudu)

2010లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన రాయుడు ఇప్పటి వరకు 204 మ్యాచులు ఆడాడు. 2010 నుంచి 2017 వరకు ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు తరపున ఆడుతున్నాడు. 2013,2015,2017 ఐపీఎల్ సీజన్ లో విజేత అయిన ముంబై ఇండియన్స్ జట్టులో రాయుడు భాగస్వామ్యం ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2018, 2021 లో టైటిల్‌ను అందుకున్నాడు. 2018 లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో రాయుడిది ముఖ్య పాత్ర వహించాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 43 సగటుతో 602 పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో ఐపీఎల్‌లో శతకాన్ని నమోదు చేశాడు. నేడు గుజరాత్‌పై చెన్నై విజయం సాధిస్తే ఆరో టైటిల్‌ను రాయుడి ఖాతాలో పడనుంది. ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటుతో 4,329 పరుగులు చేశాడు.

 

 

ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

204 మ్యాచులు, 14 సీజన్ లు, 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోపీలు నా కెరీర్ లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి అద్భుతమైన జట్లకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఆరో టైటిల్ గెలుస్తానని ఆశిస్తున్నాను. 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తో ఈ లీగ్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్ తీసుకోను’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.

 

Exit mobile version