Site icon Prime9

Karnataka: కర్ణాటకలో 38వ రోలర్ స్కేటింగ్ సెలక్షన్ ట్రైయిల్స్..

38th Roller Skating Selection Trails in Karnataka

Karnataka: 38వ కర్ణాటక రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ సెలక్షన్ ట్రైయిల్స్ లో రెండు వందలకు పైగా చిన్నారులు పాల్గొన్నారు. పలు విభాగాల్లో జాతీయ స్థాయి పోటీలకు చిన్నారులు ఎంపికైనారు. అధికంగా తక్కువ వయసు కల్గిన వారు ఎంపిక అవడం పలువురిని ఆనందానికి గురిచేసింది. తల్లి తండ్రుల సమక్షంలో సెలక్షన్ ట్రైయిల్స్ లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

11-14 సంవత్సరాల క్యాటగిరిలో ప్రముఖ బాంకులో పనిచేస్తున్న కీలక ఉద్యోగి తనయుడు చీమకుర్తి శ్రీవత్సవ జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైనారు. నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన చిన్నారి శ్రీవత్సవ తల్లి తండ్రులు వృత్తిరీత్యా కర్ణాటకలో ఉన్నారు. విద్యలోనూ రాణిస్తూ శ్రీవత్సవ క్రీడాల పట్ల ఉన్నతిని సాధించడం పట్ల పలువరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కాళంగి ప్రభాకర్ కు శ్రీవత్సవ మనవుడు కావడంతో పలువురు అభినందనలు అందచేశారు. జాతీయ స్థాయి ఎంపిక పట్ల క్రీడాపోటీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లి తండ్రులదేనని మరోమారు రుజువైంది.

ఇది కూడా చదవండి: IND vs ZIM: భారత్ భారీ విజయం.. ఆకాశమే హద్దుగా చెలరేగిన “స్కై”

Exit mobile version