Site icon Prime9

ముజఫర్‌నగర్‌ : ముజఫర్‌నగర్‌లో లక్షల టన్నుల అమెరికన్ ప్లాస్టిక్..?

PLASTIC

PLASTIC

Muzaffarnagar : న్యూ ఢిల్లీకి ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఉన్న ముజఫర్‌నగర్, భారతదేశంలో రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మరియు బెల్లం ఉత్పత్తికి సహాయం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు. అయితే రీసైకిల్ చేయబడిన అమెరికన్ ప్లాస్టిక్‌కు టన్నుల కొద్దీ తుది గమ్యస్థానంగా ముజఫర్‌నగర్ కొత్త హోదా సంపాదపించుకుంది. అవును..అమెరికన్లు వాడిపారేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలకు యూపీలోని ముజఫర్‌నగర్‌ చిరునామాగా మారింది. ఎక్కడో వాషింగ్టన్‌లోని ఆల్మోండ్‌ రాపర్లు, ఫుడ్‌ కవర్లు, సాఫ్ట్‌ డ్రింక్‌ టిన్స్‌, వాడిపారేసిన వాటర్‌ బాటిల్స్‌, పాలిథిన్‌ కవర్లు, అమెజాన్‌ ఈ-కామర్స్‌ ర్యాపర్లు ఇప్పుడు ముజఫర్‌నగర్‌ యార్డుల్లో గుట్టలుగా కనిపిస్తున్నాయి. సుమారు 8 వేల మైళ్ల దూరాన్ని దాటుకొని అవన్నీ ఇక్కడికెలా వచ్చాయంటూ అమెరికన్‌ మీడియా ‘బ్లూమ్‌బర్గ్‌’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టగా.. ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

వ్యర్థాలను కాల్చివేయడం అమెరికాలో నిషిద్ధం. నిబంధనలమేరకు వాటిని రీ-సైక్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. 2 రూపాయల విలువ చేసే ఖాళీ ప్లాస్టిక్‌ బాటిల్‌ను ఫెడరల్‌ నిబంధనల ప్రకారం రీ-సైక్లింగ్‌ చేయాలంటే 11 రూపాయల ఖర్చు అవుతుంది. దీంతో ఆ చెత్తను గతంలో ఆఫ్రికాలోని పేద దేశాలకు తక్కువ ఖర్చుతో తరలించిన అమెరికా.. ఇప్పుడు ఆ రూటును ఇండియాకు మార్చింది. రీ-సైక్లింగ్‌ కోసం ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వాడిపారేసిన కాగితాన్ని దిగుమతి చేసుకోవడాన్ని కేంద్రం 2019లోనే నిషేధించింది. అయితే, ముజఫర్‌నగరలోని కాగితపు ఫ్యాక్టరీ, బెల్లం తయారీ కర్మాగారాలకు ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు అవసరమవుతున్నాయి. చౌకగా అమెరికన్ల వేస్టును దిగుమతి చేసుకొంటున్న అక్కడి పారిశ్రామికవేత్తలు ఆ వ్యర్థాలను తగులబెట్టడం, అట్టల తయారీకి వినియోగించడంతో పాటు పాడైపోయిన ప్లాస్టిక్‌తో కొత్త బొమ్మలను తయారుచేస్తున్నారు. ముజఫర్‌నగర్‌లోని ఓ యార్డులోనే 2 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. ఇలాంటి యార్డులు ముజఫర్‌నగర్‌తో పాటు పరిసర పట్టణాల్లో వందలాదిగా ఉన్నట్టు పరిశీలనలో తేలింది.

అమెరికా నుంచి భారత్‌కు ఏటా 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు దిగుమతి అవుతున్నట్టు అంచనా. నిషేధం ఉన్నప్పటికీ, దిగుమతులు జరుగడంలో అధికారుల పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవాలోని పోర్టుల ద్వారానే రవాణా అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడి పోర్డులు అదానీ కంపెనీకి చెందినవే. బసెల్‌ కన్వెన్షన్‌ యూఎన్‌ ఒప్పందం ప్రకారం.. హానికారక, ప్లాస్టిక్‌ వ్యర్థాల రవాణాకు సంబంధించి ఇరు దేశాలు ముందస్తు ఒప్పందం చేసుకోవాలి. అంటే, కేంద్రానికి అమెరికా వ్యర్థాల దిగుమతుల గురించి తెలియకుండా ఉండదనేది నిపుణుల వాదన.

Exit mobile version