Site icon Prime9

Kerala : కేరళలో బీడీలు చుట్టిన వ్యక్తి … అమెరికాలో జడ్జి అయ్యాడు..

kerala

kerala

Kerala :  టెక్సాస్‌లోని దేశీ అటార్నీ జిల్లా కోర్టులో కేరళకు చెందిన సురేంద్రన్ కె పటేల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే సురేంద్రన్ కె పటేల్ ఈ స్దాయికి చేరడం వెనుక చాలా పోరాటమే ఉంది. పేదకుటుంబంలో పుట్టి బీడీలు చుట్టుకుంటూ జీవనం సాగించిన సురేంద్రన్ కేవలం చదువే జీవితాన్ని మార్చగలదని నమ్మారు. పటేల్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులు. అతను చదువుకుంటున్న సమయంలోనే కుటుంబం పరిస్దితుల కారణంగా రకరకాల పనులు చేసారు. కూలిపనులు చేసి కొంత డబ్బు సంపాదించేందుకు తన సోదరితో కలిసి ఫ్యాక్టరీలో బీడీలు చుట్టేవారు.

అతను 10వ తరగతిలో చదువు మానేసి పూర్తి సమయం బీడీలు చుట్టడం ప్రారంబించారు.

అయితే ఆ సంవత్సరంలో అతనిదృక్పథం” మారిపోయింది.

అతను తన విద్యను కొనసాగించడానికి కళాశాలలో చేరాడు.

ఒకవైపు బీడీలు చుడుతూనే మరొకవైపు చదువు కొనసాగించారు. పటేల్ లాయర్ కావాలని  నిర్ణయించుకున్నాడు.

కానీ పని కారణంగా తరగతులకు హాజరవలేకపోయాడు, అతని క్లాస్‌మేట్స్ అతనికి సహాయం చేసారు.పటేల్ కళాశాలలో అగ్రస్థానంలో నిలిచి తరువాత న్యాయ విశ్వవిద్యాలయంలో చేరారు. చదువుకొనసాగించడానికి మొదటి సంవత్సరంలో అతని స్నేహితుల నుండి డబ్బు తీసుకున్నాడు. అతను ఇలా కొనసాగించలేనని తెలిసి, సహాయం కోసం ఒక వ్యాపారవేత్త వద్ద పార్ట్-టైమ్ హౌస్ కీపింగ్ ఉద్యోగంలో చేరారు. 1995లో, పటేల్ తన లా డిగ్రీని పూర్తి చేసిచ కేరళలోప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అతను సుప్రీంకోర్టులో పనిచేశాడు.

kerala

2007లో నర్సు అయిన అతని భార్యకు ప్రముఖ అమెరికన్ మెడికల్ ఫెసిలిటీలో ఉద్యోగ అవకాశం వచ్చింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ జంట హ్యూస్టన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.పటేల్‌కు అప్పుడు ఉద్యోగం లేదు. అతను ఒక కిరాణా దుకాణంలో ఉద్యోగం చేసాడు. కిరాణా దుకాణంలో పనిచేసిన తర్వాత, అతను యూఎస్ లో న్యాయవాద వృత్తిని అభ్యసించాలని హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో చేరారు. అతను 2011 లో పట్టభద్రుడయ్యాడు. కుటుంబ చట్టం, క్రిమినల్ డిఫెన్స్, సివిల్ మరియు కమర్షియల్ లిటిగేషన్, రియల్ ఎస్టేట్ మరియు లావాదేవీలకు సంబంధించిన కేసులను నిర్వహించాడు.నేను టెక్సాస్‌లో ఈ స్థానానికి పోటీ చేసినప్పుడు, నా యాసపై వ్యాఖ్యలు చేశారు మరియు నాపై ప్రతికూల ప్రచారాలు జరిగాయి. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా స్వంత పార్టీ అనుకోలేదు,” అని సురేంద్రన్ అన్నారు.”నేను దీన్ని సాధించగలనని ఎవరూ నమ్మలేదు. కానీ ఇక్కడ నేను ఉన్నాను. అందరికీ ఒకే ఒక సందేశం ఉంది. మీ భవిష్యత్తును ఎవరూ నిర్ణయించుకోవద్దు. మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి” అని పటేల్ చెప్పారు.

జనవరి 1న టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలోని 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. అతను గత ఏడాది నవంబర్ 8న ఈ పదవికి జరిగిన ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి ఎడ్వర్డ్ క్రెనెక్‌ను ఓడించాడు.కేరళలో పేదరికంలో జన్మించిన అతను అగ్రరాజ్యంలో ఉన్నతస్దానానికి చేరారు.

ఇవి కూడా చదవండి…

కుంగిపోతున్న నగరం.. భయం భయంగా ప్రజలు.. జోషిమఠ్‌లో ఏం జరుగుతుందంటే..?

ఛత్తీస్‌గఢ్‌ నుంచి మొదటి మహిళా ‘అగ్నివీర్’గా ఆటో డ్రైవర్ కుమార్తె

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version