Site icon Prime9

Somu Veeraju: వైకాపా హిందూ ధ్వేష ప్రభుత్వం.. సోము వీర్రాజు

YSRCP Hindu hate government..Somu Veeraju

YSRCP Hindu hate government..Somu Veeraju

Somu Veeraju: ఏపీ ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా హిందూ ధ్వేషాన్ని వెళ్లగక్కుతున్న ప్రభుత్వంగా పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాల్లో స్వామి వార్లకు చేపట్టే సేవల ధరలను అధిక రెట్లు పెంచడంపై సోము వీర్రాజు స్పందించారు.

అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో అభిషేకం సేవ ధర రూ. 750 నుండి రూ. 5000 వేలకు పెంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విఘాత నిర్ణయాలు పర్వదినాల్లో తీసుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఒక విధంగా వైకాపా ప్రభుత్వం హిందూ ధ్వేషాన్ని వెళ్లగక్కుతుందని దుయ్యబట్టారు. పెంచిన ధరల నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా ద్వారకా తిరుమలలో భక్తులకు పులిహోరను మాత్రమే ప్రసాదంగా పెట్టడాన్ని భాజపా అధ్యక్షుడు తప్పుబట్టారు. పర్వదినాల్లో చక్కెర పొంగలి, వడ, తదితర ప్రసాదాలను భక్తులకు దరి చేర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

పలు ముఖ్య ఆలయాల్లో ఏపి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సేవల ధరలను పెంచడంపై ఇకనైనా దృష్టి సారించాలి. సామాన్య భక్తులకు స్వామి వారి సేవలను దరిచేర్చేలా చూడాల్సిన బాధ్యత దేవదాయ శాఖపై ఉంది.

ఇది కూడా చదవండి: కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి హల్ చల్

Exit mobile version