Prime9

Hyper Aadi: హైపర్ ఆదికి డైపర్ వెయ్యాల్సిన సమయం వచ్చింది.. వైసీపీ నేతల సెటైర్స్ వైరల్

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది(Hyper Aadi) బాగా ఫేమస్ అయ్యి టీవీ షోలతో బిజిగా అయ్యారు. కాగా, ఆది.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే పవన్ ఇటీవల రణస్థలం వేదికగా యువశక్తి సభ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఆ సభలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హైపర్ ఆది వైసీపీ నాయకులపై తనదైన స్టైల్లో పంచులు గుప్పించారు.

దానితో వైసిపి నాయకులు, అభిమానులు, సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆదిని(Hyper Aadi) టార్గెట్ చేస్తూ సెటర్లు వేస్తున్నారు.

రెచ్చిపోయి టార్గెట్ అయిన హైపర్ ఆది..

పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని పదేపదే ఎద్దేవా చేస్తున్నారు.. ఓడిపోతేనే ఇంతమంది కష్టాలను తీర్చాడు అంటే గెలిస్తే వాళ్లకు కష్టం కాంపౌండ్ వాల్ దాటనివ్వడని హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ ది ఆస్తులు కూడబెట్టుకునే మనస్తత్వం కాదని స్పష్టం చేశారు అలా ఆస్తులే కూడబెట్టుకోవాలని చూస్తే ఆయనకు ఎంత ఆస్తి ఉండేదో ఎవరూ ఊహించలేరంటూ అన్నారు.

ఇకపోతే ఆ శాఖ ఈ శాఖ అని పవన్ కళ్యాణ్ ని తిట్టడం దేనికని అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోదా అంటూ వైసీపీ నేతలకు ఆది చురకలు అంటించారు.

అంతేకాక పాపులారిటీ కోసం పవన్ కళ్యాణ్ పర్సనాలిటీని దెబ్బ కొట్టాలని చూస్తే.. ఈ సారి జనసేన కొట్టే

దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడంటూ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది రెచ్చిపోయారు.

ఇదిలా ఉంటే ప్రధానంగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని, నాగబాబును టార్గెట్ చేసిన జబర్ధస్త్ మాజీ జడ్జి అయిన మంత్రి రోజాను మరికొందరు వైసీపీ ముఖ్య నేతలను

ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాస్త రాజకీయ దుమారం రేపాయి. దానితో హైపర్ ఆది కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

నెంబర్ ఇచ్చీ మరీ విసికించవద్దంటూ..

ఈ తరుణంలో వైసిపి నేతలు ఆదిని టార్గెట్ చేస్తోన్నారు. హైపర్ ఆదికి డైపర్ వేయాల్సిన సమయం వచ్చిందంటూ నెట్టింట సెటర్స్ వేస్తున్నారు.

ఆది ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వికించవద్దూ.. అందరూ పద్ధతిగా పలకరించాలంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

మరి ఆ పోస్టులో మెన్షన్ చేసిన నెంబర్ కి కాల్ చేసి ట్రోల్ చేయడానికి వైసీపీ కార్యకర్తలు అభిమానులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

అయితే ఇంతకీ ఆ ఫోన్ నెంబర్ హైపర్ ఆదిదేనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ పోస్టులపై ఆది ఏ విధంగా స్పందిస్తారనేచి చూడాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar