Site icon Prime9

Devineni Uma: పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం

Who gave water to Pulivendula and Kuppam areas

Who gave water to Pulivendula and Kuppam areas

Andhra Pradesh: ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ప్రాజక్టులపై మాట్లాడేందుకు మంత్రి అంబటి అనర్హుడన్నారు. అమరావతి రైతులపై వైకాపా శ్రేణులు, మంత్రుల చేస్తున్న కారుకూతలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల గురించి మంత్రులకు సరైన అవగాహన కూడా లేదన్నారు. అధికారుల చేత మాట్లాడిస్తూ తప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ప్రాజెక్టులపై ఖర్చు పై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఒక్క ప్రాజక్టును కూడా పూర్తి చేయలేదని హేళన చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజక్టులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

Exit mobile version