Chandrababu Naidu Comments: అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్‌లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన వాళ్ళే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, తప్పు చేయని వాళ్ళు తప్పించుకోవాలని ఎందుకు అనుకోరని చంద్రబాబు ప్రశ్నించారు.
సాక్ష్యాలుంటే మమ్మల్ని బతకనిచ్చే వారా? (Chandrababu Naidu Comments)
సిట్ వేసుకోనివ్వండి .. ఇన్నాళ్లు ఏం చేశారు? చాలా వెతికారు ఏం జరిగింది. జగన్ దగ్గర సాక్ష్యాలుంటే మమ్మల్ని బతకనిచ్చే వారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మా అకౌంట్లకు ఒక్క రూపాయైనా వచ్చిందా? జగన్ షెల్ అకౌంట్లలోకే డబ్బులు వచ్చాయని అన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో ఏదో జరిగిందన్నారు.. ఏం చేశారు?ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్‌సైడ్ ట్రేడింగ్ అన్నారు.. ఏంచేశారని అడిగారు. మేం క్లీన్‌గా ఉన్నాం మమ్నల్ని ఏం చేయలేరని చంద్రబాబు స్పష్టం చేసారు.
https://youtu.be/aJm5bhSt26c