Dendaluru: ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైకాపా పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ దెందలూరు నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మీ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆమె వాసిరెడ్డి పద్మపై విరుచుకపడ్డారు.
ఏనాడైనా రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న మహిళా సమస్యలపై వాసిరెడ్డి పద్మ స్పందించారా, అసలు రాష్ట్రంలో తిరుగుతున్నారా అంటూ ప్రశ్నించారు. మహిళా కమీషన్ సభ్యులుగా అధికార పార్టీకి చెందినవారు ఉండకుండా చూడాలన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పేరుతో విడాకుల తీసుకొన్న మహిళలను రోడ్డుపైకి లాగడం ఎంతవరకు సబబన్నారు. వాసిరెడ్డి పద్మ వెంటనే తన పదవికి రాజీనామ చేయాలంటూ నినదించారు. పవన్ కల్యాణ్ కు క్షమాపణ చెప్పి ఇకపై ఇలాంటి కపట నోటీసులు ఇవ్వద్దంటూ సూచించారు.
ఇది కూడా చదవండి: Narreddy Tulasi Reddy: నరకాసురుడి పాలనను తలపిస్తున్న ఏపీ ప్రభుత్వం..కాంగ్రెస్ నేత తులసీరెడ్డి