Site icon Prime9

Kishan Reddy: ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారు.. కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Hyderabad: ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదనతో, తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారు. కిరాయి ఆర్టిస్టులతో, పార్టీ నేతలతో కేసిఆర్ అందమైన అబద్ధం సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కేసీఆరే అని విమర్శించారు

సొంత పార్టీనేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి ఇదే నిజం అని చెప్పేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇది రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి, దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదం.

గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేస్తున్నానని చెప్పారు. దేశంలోని అన్ని పత్రికా సంస్థలకు కూడా ఈ వీడియోలు పంపానని, అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు ఈ వీడియోలు పంపుతానని కేసీఆర్ తెలిపారు.

Exit mobile version