Site icon Prime9

Munugode by poll: మునుగోడు బరిలో తెలంగాణ తెదేపా?

TDP ready for election contest in Munugode

TDP ready for election contest in Munugode

Munugode: మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలంగాణ టీడీపీ దిగనుంది. ఆ పార్టీ అభ్యర్ధిగా జక్కలి ఐలయ్య యాదవ్ పోటీ పోటీ చేయనున్నారు. రేపటిదినం టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది.

గత రెండు రోజులుగా మునుగోడు ఎన్నికల బరిలో ఉండాల వద్ధా అన్న అంశం పై తెలంగాణ ప్రాంత తెదేపా నేతలు, చంద్రబాబుతో మంతనాలు, తర్జన భర్జనలు సాగాయి. అయితే తెలంగాణ తెదేపా పార్టీ అధ్యక్షుడు బక్కుల నరసింహులు ఎన్నికల పోటీలో ఉండాలని ,చంద్రబాబు పై వత్తిడి తీసుకొచ్చారు. ఒక విధంగా తెలంగాణాలో టీడీపీ పూర్వ వైభవాన్ని తెచ్చుకొనేందుకు పావులు కదుపుతోంది.

ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఓసీ వర్గానికి చెందిన అభ్యర్ధులను ఎన్నికల బరిలో దించాయి. అయితే తెదేపా మాత్రం బిసీ వర్గానికి చెందిన జక్కలి ఐలయ్యను ప్రతిపాదిస్తూ, బీసీలకు వెన్నంటి ఉండేది తెదేపా ఒక్కటేనని చెప్పే ప్రయత్నాన్ని మరోసారి తెలియచేయనుంది.

ప్రచారాన్ని ఏ విధంగా చేపట్టాలి, చంద్రబాబు, లోకేష్, తదితర ముఖ్యులు మునుగోడు బరిలో తమ ప్రచారాన్ని చేపట్టేందుకు ఎన్టీఆర్ భవన్ లో ఇప్పటికే తగిన ప్రణాళికలు సిద్ధమైన్నట్లు తెలుస్తుంది. 14వ తేదీని ఐలయ్య తెదేపా తరపున నామినేషన్ కూడా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  మునుగోడు ఓటర్ల నమోదు పై భాజపా పిటిషన్

Exit mobile version