Site icon Prime9

Actor Ali: ఏపీ ప్రభుత్వ సలహాదారు వచ్చి కామెడీ చేసి వెళ్లారు.. యాక్టర్ అలీపై టీడీపీ నేతల సెటైర్స్

Actor Ali

Actor Ali

Actor Ali: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, యాక్టర్ అలీపై నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాశ్ విమర్శలు గుప్పించారు.

అలీ వచ్చి కామెడీ చేసి వెళ్లారంటూ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ చిత్తూరు జిల్లాలోని నగిరి అభివృద్ధికి నోచుకోలేదని..

రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలో వస్తుందని తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

నగరి కొండచుట్టు ఉత్సవంలో పాల్గొన్న గాలి భాను ప్రకాశ్, కమెడియన్ అలీ(Actor Ali) కామెంట్స్‌పై స్పందించారు.

ఎదురు దాడులు, వింత చేష్టలు, తప్ప నగరికి చేసింది ఏమీ లేదన్నారు.

వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 వస్తాయని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో రోజా ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా నగరిలో మళ్లీ ఎగరవేస్తామని గాలి భాను ప్రకాశ్ తెలిపారు.

సినిమాలు, రాజకీయాలు రెండూ వేరువేరు

నగరిలో సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా అలీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూటికి నూరు శాతం రాష్ట్రంలో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రోజా కూడా నగరిలో మరోసారి విజయం సాధిస్తారని ఆయన అన్నారు.

అంతేకాకుండా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ అని అలీ అన్నారు.

డైమండ్ రాణి రోజా అని యవశక్తి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ.. డైమండ్ అనేది చాలా విలువైనది ఆయన చెప్పారు.

రోజా కూడా తగ్గేదే లేదంటూ ఆమె ఓ ఫైర్‌ బ్రాండ్‌ అని ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన తెలిపారు.

సినిమాలు, రాజకీయాలు రెండూ వేరువేరు అని వ్యాఖ్యానించిన అలీ.. జగన్ ఆదేశిస్తే పవన్‌ కళ్యాణ్ పై పోటీకి తాను సిద్ధమన్ని స్పష్టం చేశారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version