Site icon Prime9

TDP: తెదేపాలో చేరిన తణుకు వైకాపా నేతలు, కార్యకర్తలు

Tanuku YCP leaders and activists who joined TDP

Tanuku: మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు వైకాపా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు తేతల్లి, సూరంపూడి గ్రామాలకు చెందిన 100మంది వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ఖండువ కప్పి సాదరంగా వారిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ అవినీతి, అరాచక విధానాలతో వైసీపీ పతనం మొదలైందన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మట్టా వెంకట్‌, మట్టా నాగేశ్వరరావు, కట్టా శ్రీరాంమూర్తి, భూపతిరాజు, వెంకటరామరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version