Site icon Prime9

TRS: తెరాస పార్టీలోకి జంప్ చేసిన భాజపా నేతలు స్వామి గౌడ్, దాసోజి శ్రవణ్

Swami Goud and Dasoji Shravan are the BJP leaders who jumped into the Trs Party

Swami Goud and Dasoji Shravan are the BJP leaders who jumped into the Trs Party

Hyderabad: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ భాజపా పై గురిపెట్టింది. తెలంగాణ అభివృద్ధిపై పదే పదే విషం చిమ్ముతున్నారంటూ తెరాస శ్రేణులు ఇప్పటివరకు ఆరోపించారు. భాజపాకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకొంటున్నారు. ఒకే రోజు భాజపాకు చెందిన స్వామి గౌడ్, దాసోజి శ్రవణ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు ఇరువురు నేతలు తమ రాజీనామా లేఖలను పంపించారు. తెలంగాణ పట్ల భాజపా వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాధ కల్గించిందని నిజమైన రాజకీయ నేతలను తలపించారు. ప్రజలకు ఆకాంక్షలకు తగ్గట్టుగా భాజపా నడుచుకోవడం లేదంటూ ఆ పార్టీతీరును ఎండగట్టారు.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన స్వామిగౌడ్, పలు అంశాల పై చర్చించారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న స్వామిగౌడ్, తెలంగాణ ఏర్పడ్డాక తొలి శాసన మండలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం స్వామి గౌడ్ కు పెద్దగా తెరాస అగ్రనేత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో క్రియాశీలకంగా పార్టీలో వెనుకబడిపోయారు. అనంతరం భాజపాలో చేరారు. చివరకు తిరిగి తన సొంతగూటికి చేరుకొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసిఆర్ మూడు రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భాజపా నేతలపై విల్లు ఎక్కుపెట్టేందుకు ఆ పార్టీలోని నేతల్ని తన పార్టీలోకి చేర్చుకొని కేసిఆర్ దెబ్బ రుచి చూపించాడని అందరూ భావించేలా ప్లాన్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు తెరాసకు ప్రతిష్టాత్మకంగా మారడంతో కేసిఆర్ ఓ అడుగు కిందకు దిగి మరీ నేతల్ని తన పార్టీలోకి చేర్చుకొంటున్నారు. పలు తాయిలాలతో మచ్చిక చేసుకొంటున్నారు. యావత్తు మంత్రి వర్గం మునుగోడు నియోజకవర్గంలో తిష్ట వేసి తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: YS Sharmila: కేసిఆర్ ప్రభుత్వం పై కాగ్ కు ఫిర్యాదు చేసిన షర్మిల

Exit mobile version