Site icon Prime9

Kanna Lakshminarayana: పవన్ కళ్యాణ్ విషయంలో సోము వీర్రాజు ఫెయిల్.. కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని, జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము ఒక్కడే అన్ని చూసుకోవడం వల్లే ఈ పరిస్ధితి దాపరించిందని.. పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు.

తనకు బీజేపీ నుంచి సరైన మద్ధతు లభించడం లేదని, రోడ్ మ్యాప్ అడిగినా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి. తాను టీడీపీతో కలిసి వెళతానని పవన్ క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది నేతలు ఇదే అదునుగా ఆయనపై విమర్శలు చేయడానికి సిద్దమయ్యారు. దీనిలో భాగంగా సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఎక్కడా బలంగా పనిచేయలేకపోయాం. అది బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా తెలుసు. మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు రోడ్డు మ్యాప్ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుంది. పవన్ కల్యాణ్ పదవి కోసమైతే ఇంత ఆరాట పడడు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయం అని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి విజయవాడ వచ్చిన వెంటనే సోము వీర్రాజు ఆయనను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఏపీలో తాజా రాజకీయపరిణామాలపై ఢిల్లీ నేతలకు అప్ డేట్ ఇచ్చారు.

Exit mobile version