Prime9

Minister Roja: పవన్ కళ్యాణ్ పై రోజా ఫైర్

Amaravati: సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్ సభలకు వస్తున్నారని ఆమె అభిమానులను సైతం సీన్ లోకి లాగారు. పవన్ కు సింగల్ గా పోటీ చేసే దమ్ములేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, చిరంజీవిలు సొంతంగా ఎన్నికల బరిలో దిగారని రోజా గుర్తు చేశారు. అసెంబ్లీలో జండా ఎగరవేసేందుకు అసలు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పవన్ పార్టీకి ఉన్నారా అంటూ రోజా హేళన చేశారు. విభజన చట్టంలో ఏపీ ఆస్తుల పై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని రోజా ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో వైకాపా నేతలు కూడా విభజన చట్టంలోని ఆస్తుల పై ఎవ్వరూ మాట్లాడడం లేదన్న సంగతిని రోజా మరిచారు.

ఏపీ ప్రజలు సీఎం జగన్ కు మద్దతుగా ఉన్నారని పేర్కొన్న మంత్రి రోజా, స్థానిక సంస్ధల ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. సినీ రంగం నుండి వచ్చిన రోజా సిని అభిమానుల పై ఛలోక్తిగా మాట్లాడడం చర్చగా మారింది.

Exit mobile version
Skip to toolbar