Site icon Prime9

Ponguleti On KCR: శ్రీరాముడినే మభ్యపెట్టిన ఘనత కేసీఆర్ ది

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti On KCR: మైకు తీసుకుంటే ప్రజలను మభ్య పెట్టడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట… మాటలకే పరిమితం తప్ప… చేతలు అనేవి ఈ సీఎంలో లేవని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. తెలంగాణ బిడ్డలను అసత్యాలతో భ్రస్టు పట్టిస్తున్నారని. భద్రాచల పుణ్యక్షేత్రానికి వంద కోట్ల రూపాయల నిధులు ఇస్తానన్న మాట అటు ఉంచితే.. గడిచిన ఎనిమిదిన్నరేళ్ళలో వంద రూపాయలు కూడా హుండీలో వేసిన పాపాన పోలేదన్నారు. జెండా ఏదైనా ఎజెండా మాత్రం రాబోయే ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను గద్దె దించటమే అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

 

పేపర్ లీకేజీలో బాధ్యత వహించాలి(Ponguleti On KCR)

ఆరు దశాబ్దాలు గా పోరాడి సంపాదించుకున్న రాష్ట్రం ఇప్పుడు సీఎం కేసిఆర్ వల్ల దగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. భద్రాచల నియోజకవర్గానికి వరద ముప్పు సమయంలో వేయికోట్ల నిధులు ఇస్తానని ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. టీఎస్ పీఎస్సీఈ పేపర్ లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ తప్పిదానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహిస్తూ పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సిట్ కి కాకుండా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

 

యువత దగా పడుతోంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్ప.. అర్హులైన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు. నియమాకాల కోసం పోరాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత దగా పడుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఉద్దరించలేని ఈ సీఎం దేశాన్ని ఉద్దరిస్తాడట… అంటూ ఎద్దేవా చేశారు. ఏళ్ళు గడుస్తున్న పోడు భూముల రైతుల సమస్యలకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఒక్క పోడు భూమి పట్టాదారునికి కూడా పట్టా ఇచ్చిన దాఖలా లేదన్నారు. అతి త్వరలోనే తన జెండా ఎజెండాను ప్రకటిస్తానని జెండా ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకట్రావ్ బరిలో ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని పేర్కొన్నారు.

 

Exit mobile version