Pawan Kalyan In Bhimavaram: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలోని తూర్పు కాపులతో, జసనేస నేతలతలో సేనాని కీలక సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర నుంచే తూర్పుకాపుల వలస ఎక్కువగా ఉందని.. బీసీ కులాలు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారు కానీ కులం మాత్రం వెనకబడే ఉందని ఆయన తెలిపారు. అంతే కాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించి నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..
Pawan Kalyan In Bhimavaram: బీసీ కులాలు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలి.. భీమవరంలో పవన్ కళ్యాణ్

Pawan kalyan in Bhimavaram