Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఇందులో ఎటువంటి సందేహం అక్కరలేదని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ వెనుక 75 శాతం మందికాపులు, 50శాతం బీసీలు వెనుక ఉన్నారని అన్నారు.
యువత అంతా మీ వెనుకే ఉంది. మహిళా సమాజం అంతా ఉంది. ఒంటరిగా వెళ్లినా ప్రమాదమేమీ లేదు. దైర్యంగా ముందుకు వెళ్లండని అన్నారు.
జగన్మోహన్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనేపేరు ఉంది. 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రజలను బ్రతకనీయడు.
పవన్ కళ్యాణ్ నీతిమంతుడు. ప్రజలు నీతివంతమైన ముఖ్యమంత్రిని కోరుతున్నారు.నేను పలువురి సీఎంలను చూసాను.
ఒక్క ఎస్టీఆర్ తప్ప మిగిలిన వారందరూ.. ఎంతోకొంత అవినీతికి పాల్పడినవారే.
ఆంధ్రప్రదేశ్ లో నీతివంతమైన పాలన పవన్ వల్లే సాధ్యమవుతుంది.
కొంతమంది పవన కళ్యాణ్(Pawan Kalyan)కు అనుభవం లేదంటారు. ప్రజాధనం దోచుకోవడంలో అతనికి అనుభవం లేదు.
పేదలపట్ల , వారిసంక్షేమం పట్ల అతనికి ఉన్న కమిట్ మెంట్ ఈ రోజు ఎవరికీ లేదు.
అతనికి చక్కని కామన్ సెన్స్ ఉంది. అతనికి సలహాలు ఇవ్వడానికి అధికారయంత్రాంగం ఉంది.
పవన్ సీఎం అవడం ఖాయం. ఎన్నికలకు ముందే మెజారిటీ సంపాదంచి సీఎం అవుతాడా, లేక ఎన్నికల తరువాత కూటమిగా ఏర్పడి సీఎం అవుతాడా అన్నది తరువాత.
2024లో అతనే సీఎం. బస్సు యాత్ర ముగించే నాటికి పవన్ ను సమర్దించే ఓటర్ల శాతం 40 కు చేరుతుందని హరిరామజోగయ్య అన్నారు.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏపీ సర్కార్ స్పష్టత నివ్వాలంటూ హరిరామజోగయ్య ఇటీవల నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే.
అయితే తరువాత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆయన దీక్ష విరమించారు.
ఏపీ సర్కార్ మూర్ఖపు ప్రభుత్వమని కాపు రిజర్వేషన్లు వేరే విధంగా సాధించుకుందామని పవన్ కళ్యాణ్ హరిరామజోగయ్యకు నచ్చచెప్పారు.
హరిరామజోగయ్య 85 ఏళ్ల వయసులో మందులు కూడా వేసుకోకుండా దీక్ష చేయడం బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్రానికి జోగయ్యలాంటి వ్యక్తుల అనుభవం, సలహాలు అవసరమన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే తెలుగుదేశం పార్టీకి కాపుల మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు.
లేకుంటే కాపులు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హరిరామ జోగయ్య అన్నారు.
పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా కాపుల ఓట్లు కావాలనుకుంటే అది టీడీపీ అత్యాశే అవుతుందని తెలిపారు.
వెంటనే దీనిపై చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/