Site icon Prime9

Glass Symbol Tension: ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి గాజు గ్లాసు గుర్తు టెన్షన్

Glass Symbol

Glass Symbol

Glass Symbol Tension:ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ ఇంకా పోలేదు .ఇటీవల గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు. జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని కొంతమంది ఈసీకి విన్నవించారు. దీనిపై జనసేన గత వారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు..(Glass Symbol Tension)

ఈసీ సూచనల మేరకు గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా మెమో జారీ చేశారు.అయినప్పటికీ గాజు గ్లాస్ గుర్తు జనసేన పోటీచేయని మిగతా చోట్ల కొంత మందికి కేటాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .విజయనగరం టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్లు తెలుస్తోంది .అదే విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన రెబెల్ అభ్యర్థి పాటంశెట్టి సూర్య చంద్ర కు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు .ఇతర స్థానాల్లో కూడా కొంత మందికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించే వీలు ఉందని సమాచారం .దింతో కూటమిలో ఆందోళన కలుగుతోంది .జనసేన పోటీ చేస్తున్న 21 ఎమ్మెల్యే ,2 ఎంపీ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయించారు .కానీ ఇతర చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే ఓటర్లు అదే గుర్తుకు ఓటేసే అవకాశం వుంది .ఒక వైపు ఎన్నికల సంఘం ఇతర స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేసినా .ఇలా ఎందుకు గుర్తును కేటాయిస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి దింతో కూటమి అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది .చూడాలి మరి ఏమి జరుగుతుందో …

జనసేన కి బిగ్ షాక్..పసుపులేటి కి గాజు గ్లాసు గుర్తు | Big Shock To Janasena Party | Prime9 News

Exit mobile version
Skip to toolbar