Janasena Yuvashakthi: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు.
నియంతలా వ్యవరిస్తున్న జగన్..
మరోవైపు యువశక్తి(Yuva Shakthi) సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే యువత కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారు. మరోవైపు పవన్ బహిరంగ సభ నేపథ్యంలో అధికార, జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. కాగా ఈ సభలో మాట్లాడుతూ.. వైసేపీ ప్రభుత్వంపై జనసేన నేత నాగబాబు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.
సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. వైకాపా పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు. చరిత్రలో నియంతలా వ్యవహరించిన వారంతా చివరికి ప్రజలచేతిలో పతనం అయ్యారని గూర్చు చేశారు. సీఎం జగన్ విద్యావంతుడు కాదని అందుకే ఆయనకు చరిత్ర తెలియదని నాగబాబు అన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
Nagababu: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు.. నాగబాబు కామెంట్స్ వైరల్
Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ
Somesh Kumar: ఏపీ ప్రభుత్వానికి సోమేశ్ కుమార్ రిపోర్ట్.. సీఎం జగన్ తో భేటీ
Veera Simha Reddy: అప్పుడు తొడకొడితే రైలు వెనక్కి.. ఇప్పుడు తంతే కారు వెనక్కి.. బాలయ్యకు లాజిక్‌లు ఉండవ్..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/