Prime9

Munugode: మునుగోడులో ఏకంగా పొటేళ్లు, మేకలను బహుమతిగా ఇస్తున్న రాజకీయ పార్టీలు

Munugode: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మునుగోడులో జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇతర పార్టీల నేతలతో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్తగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.ఇతర పార్టీల నేతలను వాళ్ళ వైపు తిప్పుకోవడం ద్వారా మద్దతుదారుల ఓట్లు సంపాదించుకోవచ్చని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులకు భారీగా డబ్బులు ఆఫర్ చేస్తున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది.రూ.5 లక్షల నంచి రూ.10 లక్ష వరకు ఆఫర్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఓటర్లకు మద్యం,మందును,డబ్బును పంచిం పెట్టారు.ఈ సారి ఓటర్లను ఆకట్టుకునేందుకు మునుగోడులో ప్రయత్నాలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.దసరా సందర్భంగా ప్రధాన పార్టీలు మరింత పదును పెట్టాయని తెలిసిన సమాచారం.నగదు, మద్యం భారీగా ఇస్తున్నట్లు చెబుతున్నారు.వీటితో పాటు పండుగ సందర్భంగా మాంసం, మద్యం, మేకలు, పొట్టేళ్లను బహుమతిగా ఇస్తున్నారని తెలిసిన సమాచరం.ఏకంగా వారే వాటిని డోర్ డెలివరీ చేస్తున్నారట.ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసిన సమాచారం.ఒక ప్రధాన పార్టీ ఐతే కిలో మటన్, మద్యం ఇంటికి పంపిస్తున్నారని,ఇక మరో పార్టీ ఐతే ఏకంగా పొటేళ్లు, మేకలను బహుమతిగా ఇస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ దసరా పండగను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు.

Exit mobile version
Skip to toolbar