Mudragada Daughter:మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాకిచ్చారు. ముద్రగడను వ్యతిరేకిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి వైఖరిని తాను వ్యతిరేకిస్తున్నానని, పిఠాపురంలో జనసేన గెలుపుకు పాటు పడతానని చెప్పారు.
జనసేనకు సపోర్టు చేస్తున్నాను..( Mudragada Daughter)
తన తండ్రి ముద్రగడ పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారన్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ముద్రగడ ప్రకటన అభిమానులకు నచ్చలేదని తెలిపారు. కేవలం పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే.. ముద్రగడను జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల తర్వాత ముద్రగడని వదిలేయడం పక్కా అని చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి వైసిపి నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో తన తండ్రిని వ్యతిరేకిస్తున్నానని చెప్పిన క్రాంతి తాను జనసేననకు సపోర్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు.