Minister Ambati Rambabu: తన క్యారెక్టర్ పెట్టి అవమానించారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రోపై మండిపడుతున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు కసితో రగిలిపోతున్నారు. బ్రో సినిమా ద్వారా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజి ఇచ్చారంటూ అంబటి ఆరోపిస్తున్నారు. బ్రో నిర్మాతకి అక్రమంగా డబ్బులు వచ్చాయని, ఆ నిర్మాత ద్వారా టిడిపి పవన్ కళ్యాణ్‌కి డబ్బులిచ్చిందని అంబటి చెబుతున్నారు.
సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న అంబటి..( Minister Ambati Rambabu)
ఇప్పుడు ఇదే వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఫిర్యాదు చేయాలని మంత్రి అంబటి రాంబాబు డిసైడయ్యారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్న అంబటి రాంబాబు బ్రో సినిమా లావాదేవీలపై దర్యాప్తు చేయాలని పార్టీ ఎంపిలతో కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేసి పాత్రలను చిత్రీకరించే నిర్మాతలు, రచయితలు జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ఇబ్బందులు పడవలసి ఉంటుందని అంబటి రాంబాబు హెచ్చరించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర సృష్టించడం వెనుక కీలక వ్యక్తి దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అంబటి చెప్పారు.