Mekapati Chandrashekar Reddy : ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వైకాపా నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని వదిలేసినోళ్లకు మేమెంత అంటూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన మేకపాటి. అలానే వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్ చెప్పారని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కానీ.. అది అయ్యేది ఎప్పుడో అని వ్యాఖ్యానించారు. తాను పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి డిమాండ్ చేయలేదని.. మంత్రి పదవి కూడా అడగలేదన్నారు. ఒక విధంగా తాను సీరియస్ ఎమ్మెల్యేని అని.. మంత్రి పదవి ఇస్తే తనకే ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ, తమ సోదరుడి కుమారుడు గౌతమ్ రెడ్డికి ఇచ్చారని.. అయినా సంతోషమే అన్నారు.
Mekapati Chandrashekar Reddy : తల్లిని, చెల్లిని వదిలేసినోళ్లకు మేమెంత అంటూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన మేకపాటి

mekapati chandrashekar reddy sensational comments on cm ys jagan