Site icon Prime9

Etela Rajendar: కేసిఆర్ మాటలు.. బ్రోకర్ మాటలు.. ఈటెల రాజేందర్

KCR's words..Broker's words...Etela Rajender

KCR's words..Broker's words...Etela Rajender

Munugode: తెలంగాణ సీఎం కేసిఆర్ మాట్లాడే మాటలు, బ్రోకర్ మాటలుగా భాజపా శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో హుషారుగా, జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఈటెల సీఎం కేసిఆర్ పరిపాలన తీరును ప్రజలకు తెలియచేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ రాజులాగా వ్యవహరిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసిఆర్ కు భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించే హక్కు లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందన్న సామెతను కేసిఆర్ రుజువు చేశాడన్నారు.

తెరాస పుట్టకముందు నుండే కోమటిరెడ్డి కాంట్రాక్టర్ గా ఉన్నాడని గుర్తుంచుకోవలన్నారు. కేవలం వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే కోమటిరెడ్డి భాజపా చేరాడనడం పై యాదగిరి గుట్ట పై ప్రమాణం చేసేందుకు కేసిఆర్, కేటిఆర్ లు రెడీనా అని ఈటెల ప్రశ్నించారు. తెలంగాణాలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేకత ఉందన్న ఈటెల, ఉద్యమాల గడ్డ మునుగోడుగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆర్ధిక సాయం కూడా నాడు కోమటిరెడ్డి అందిచ్చారని ఈ సందర్భంగా ఈటెల గుర్తుచేశారు.

చైతన్యవంతులైన ఓటర్లు భాజపాను ఆశీర్వదిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఫాం హౌస్, ప్రగతి భవన్ కే పరిమితమైన కేసిఆర్ సచివాలయాన్ని అవమానిస్తున్నారని ఈటెల ధ్వజమెత్తారు. పార్టీ ఫండ్ గా వందల కోట్లు తెరాస పార్టీకి వచ్చేందుకు ఏమీ వ్యాపారం చేసారన్నారు. విమానాలు కొనే స్థాయికి కేసిఆర్ చేరుకోవడం పట్ల కేసిఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొన్నాడనేందుకు ఇంకేం సాక్ష్యం కావాలన్నారు. ఆర్టీసి ఉద్యోగులు, రెవిన్యూ సిబ్బందితోపాటు ప్రభుత్వ ఉద్యోగులందరూ భాజపాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నరన్నారు.

జాతీయ నాయకులు ప్రచారానికి ఏమైనా వస్తున్నారా అన్న ప్రశ్నలకు ఈటెల తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సైలంట్ ఓటింగ్ కు అన్ని ఏర్పాటు పూర్తి అయ్యాయన్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారన్నారు. ఏ ఇంటికి ఆ ఇంటివారే కధానాయకులై భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించబోతున్నారని ఈటెల జోస్యం చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఉప ఎన్నికలో ట్విస్ట్.. గ్లాసులో మద్యం పోస్తూ బుక్కయిన మంత్రి మల్లా రెడ్డి

 

 

 

Exit mobile version