Hyderabad: జాతీయ స్థాయి రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడం పై బిజెపి నేత ఈటెల రాజేందర్ తనదైన శైలిలో విమర్శించారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా కేసీఆర్ పాలన సాగుతుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టిసారని మండిపడ్డారు.
చౌటుప్పల్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం బిజెపి కార్యాలయంలో ఈటెల మాట్లాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ పై ఏర్పాటు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని ఇకనైనా పూర్తి చేయాలని, వీరుల కుటుంబాలను ఆదుకొంటానన్న ప్రభుత్వ పెద్దల మాటలను చేతల రూపంలో చూపించాలని విజ్ఞప్తి చేశారు. చివరగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ దేశంలో, రాష్ట్రంలో ఓ చెల్లని రూపాయంటూ దుయ్యబట్టారు.